ఆదిత్యలో 8,9,10 తేదీల్లో క్యాంపస్ డ్రైవ్

UPDATED 6th SEPTEMBER 2017 WEDNESDAY 9:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో ఈ నెల 8,9 ,10 వ తేదీల్లో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ కంపెనీ "టెక్నోవెర్ట్" క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఆదిత్యలో 2018 విద్యా సంవత్సరంలో బిటెక్ పూర్తి చేసే అన్ని బ్రాంచ్ లకు చెందిన  విద్యార్థులు ఈ ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చని, సాఫ్ట్ వేర్ డెవలపర్ గా ఉద్యోగాలకు వివిధ ప్రక్రియల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రక్రియలో అభ్యర్థి పనితీరు ఆధారంగా రూ.3.4 లక్షలు వార్షిక వేతనం, అలాగే రూ.2.6 నుంచి 3.4 లక్షలు వరకు వార్షిక వేతనంతో అవకాశాలు లభిస్తాయన్నారు. అలాగే మొదటి ఆరు నెలలు కాలానికి రూ.12 వేలు( శిక్షణ, పరిశీలన) గౌరవ వేతనం లభిస్తుందని ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాసరెడ్డి, ప్లేస్ మెంట్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. 
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us