గంగవరం (రెడ్ బీ న్యూస్) 1 నవంబర్ 2021: కీటక జనిత వ్యాధుల నివారణలో భాగంగా ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రై డే ఫ్రై డే కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ అనూష సూచించారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గంగవరం పిడతమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న ఆశా వర్కర్లు, వైద్య సిబ్బందికి డ్రై డే ఫ్రై డేపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య సిబ్బంది ప్రతి శుక్రవారం ఇంటింటికి వెళ్లి దోమల లార్వా గుర్తించి వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. ఇంటి పరిసరాల్లో పాత టైర్లు, ఖాళీ కొబ్బరి బొండాలు, పాత ప్లాస్టిక్ సామాన్లలో నీరు నిల్వ లేకుండా ఉండేలా చూడాలన్నారు. ఏఎంవో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకరమైన జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు దోమల నివారణ ఒకటే మార్గమని అన్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన దోమ తెరలను ప్రతి ఒక్కరూ సక్రమంగా వినియోగించుకునే విధంగా వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ప్రసాదరావు, ఎం.పి.హెచ్.ఎస్ చెల్లారావు, వెంకటరత్నం తదితరులు ఉన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







