UPDATED 12th MARCH 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న అరాచకాలను అదుపు చేసేందుకు ప్రత్యేక చట్టాలు అమలుచేయాలని ఐద్వా మహిళా సంఘం అధ్యక్షురాలు వీరలక్ష్మి డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని వారం రోజులుగా మహిళాసంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఐద్వా సదస్సులు ముగింపు కార్యక్రమం స్థానిక మెహర్ కాంప్లెక్స్ భగత్ సింగ్ ఐక్యత కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా నాయకులు వీరలక్ష్మి మాట్లాడుతూ రోజురోజుకు మహిళలపై అరాచకాలు, సాంప్రదాయాల పేరుతో దాడులు పెరిగాయని, మహిళలు పనిచేసే చోట వివక్ష చూపుతున్నారని వాటిని నివారించాలని అన్నారు. ఎన్నికల సమయంలో మహిళల కోసం అనేక హామీలు ఇచ్చిన నేతలు నేడు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మహిళల కోసం ప్రత్యేక పథకాలు అమలు చేయాలని కోరారు. ఈ సదస్సుకు సుమారుగా ఎనభై మంది మహిళలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు కె .వరలక్ష్మి డి. బేబి, బి. లక్ష్మి, ఫాతిమా, కె .అరుణ, ఎం.వి. శ్రీలక్ష్మి, టి. నాగమణి, ఉష, ఎం. అనంత, తదితరులు పాల్గొన్నారు







