UPDATED 7th DECEMBER 2020 MONDAY 8:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో వేంచేసి ఉన్న మరిడమ్మ దేవస్థానంలో అమ్మ వారి జన్మ నక్షత్రం మఖను పురస్కరించుకుని అమ్మ వారికి పంచామృతాభిషేకం, కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.







