మహిళల గౌరవం పెంచేది టిడిపి ప్రభుత్వమే

UPDATED 4th FEBRUARY 2019 MONDAY 6:30 PM

సామర్లకోట: రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను ఏర్పాటుచేసి మహిళలకు సామాజికంగా, ఆర్థికంగా గౌరవం పెంచిన ప్రభుత్వం టిడిపి అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక 6వ వార్డులో రామాలయం వద్ద పసుపు-కుంకుమ-2, పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, జిల్లా కలెక్టరు కార్తికేయమిశ్రాతో కలిసి సోమవారం పాల్గొని లబ్దిదారులకు చెక్కులు, నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ సామర్లకోట పట్టణంలో  912 సంఘాలకు 8536 సభ్యులకు రూ.8 కోట్ల 53 లక్షల 60 వేలు విలువగల చెక్కులు మూడు విడతలుగా అందచేస్తున్నామని, అలాగే పట్టణంలో 5898 మంది వితంతువులు, వృద్ధులు, వికలాంగులు, కల్లుగీత కార్మికులు, చర్మకారులు, ఒంటరి మహిళలకు రూ.1000 పొందుతున్న వారికి రూ.2 వేలు, రూ.1500 పొందుతున్న వారికి రూ.3 వేలు నగదును అందచేస్తున్నామని తెలిపారు. రాష్ట్రం విడిపోయి ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికి ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు నూరుశాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదేనని అన్నారు. మహిళా సంఘాలకు, పింఛన్ దారులకు ఆర్థిక భరోసా కల్పించిన ఘనత ముఖ్యమంత్రిదేనని, పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలన్నారు. జిల్లా కలెక్టరు కార్తికేయమిశ్రా మాట్లాడుతూ పసుపు-కుంకుమ క్రింద మహిళలకు జిల్లాలో రూ.1071.07కోట్లు పంపిణీ చేస్తున్నామని, అలాగే పింఛన్లు క్రింద జిల్లాలో 5 లక్షల 80 వేల మందికి రూ.178 కోట్లు అందిస్తున్నామని తెలిపారు. పసుపు-కుంకుమ క్రింద మూడు దఫాలుగా ఇస్తున్న రూ.10 వేలు ఆర్థిక సహాయం పూర్తిగా ఉచితమని కలెక్టరు పేర్కొన్నారు. రాష్ట్రంలో మన తూర్పుగోదావరి జిల్లా పింఛన్లు, పసుపు-కుంకుమ పంపిణీలో ప్రథమస్థానంలో ఉందని, అలాగే జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గం మొదటిస్థానంలో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, శ్రీ భీమేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, మెప్మా అధికారి సుధాకర్, సత్యనారాయణ, సరోజినీదేవి, వార్డు కౌన్సిలర్లు, దూది రాజబాబు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us