IPL: విరాట్ కోహ్లితో సమానంగా నిలిచిన కేఎల్ రాహుల్

UPDATED 22 JANUARY 2022 SATURDAY 05:00 PM

రెడ్ బీ న్యూస్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త ఫ్రాంచైజీలు లఖ్ నవూ, అహ్మదాబాద్ జట్ల ముగ్గురేసి ఆటగాళ్లను ఎంపిక చేసుకునే ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్, శుభ్మన్ గిల్ ను తీసుకోగా.. లఖ్నవూ టీమ్ కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్, రవి బిష్ణోయిని ఎంచుకుంది. లఖ్నవూకు కేఎల్ రాహుల్, అహ్మదాబాద్ కు హార్దిక్ పాండ్య సారదులుగా వ్యవహరిస్తారు. ఫిబ్రవరి రెండో వారంలో మెగా వేలం నిర్వహించనున్నట్లు ఐపీఎల్ తెలిపింది. మొత్తం 1,214 మంది ఆటగాళ్లు మెగా వేలంలోకి వస్తున్నారు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పారితోషికం అందుకునే వారిలో కోహ్లి సరసన చేరాడు. 2018లో వేలానికి ముందే కోహ్లిని ఆర్సీబీ రూ.11 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కేఎల్ రాహుల్ కు కూడా అంతే మొత్తాన్ని ఇచ్చి లక నవూ సెలెక్ట్ చేసుకుంది. స్టోయినిస్ రూ. 9.2 కోట్లు, రవి బిష్ణోయ్ రూ. 1 కోట్లు అందుకుంటారు. లఖ్నవూ ప్రాంచైజీ రూ. 59. 89 కోట్లతో మెగా వేలంలోకి వచ్చి ఆటగాళ్లను కొనుగోలు చేయనుంది. అహ్మదాబాద్ సారథిగా ఎంపికైన హార్దిక్ పాండ్యకు రూ. 15 కోట్లు దక్కనుండగా.. రషీద్ ఖాన్ కు కూడానూ రూ.15 కోట్లు ఇస్తుండటం విశేషం. ఇక శుభమన్ గిల్ రూ. 8 కోట్లు అందుకోనున్నాడు. దీంతో మిగతా ఆటగాళ్ల కోసం వేలంలో అహ్మదాబాద్ రూ.52 కోట్లను వెచ్చించనుంది. కెప్టెన్ గా హార్దిక్ పాండ్య జట్టు సభ్యుల్లో స్ఫూర్తి నింపుతాడని ఆ జట్టు మెంటార్ గ్యారీ కిర్ స్టైన్ తెలిపాడు. సారథిగా అనుభవం లేకపోయినా రాణిస్తాడనే నమ్మకం మాత్రం తమకుందని పేర్కొన్నాడు. హార్దిక్ తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us