UPDATED 6th FEBRUARY 2018 TUESDAY 5:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో ఈ నెల ఏడవ తేదీన హైదరాబాద్ కు చెందిన ప్రముఖ కంపెనీ సెంటినీ జియో సొల్యూషన్స్ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఈసీఈ, సిఎస్ఈ, ఐటి ఇంజనీరింగ్, ఎంసిఎ విద్యార్హతలు కలిగి 65 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు హాజరుకావచ్చన్నారు. ఆన్ లైన్ టెస్ట్, జెఎఎం, టెక్నికల్, హెచ్ఆర్ రౌండ్లలో పరీక్షించి ఎంపికలు నిర్వహించి, ఎంపికైన వారికి ఒక సంవత్సరం శిక్షణనిచ్చి, శిక్షణా కాలంలో రూ. 2.16 లక్షలు వార్షిక వేతనంగా లభిస్తుందని ఆయన తెలిపారు. అర్హత గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, తదితరులు పాల్గొన్నారు.







