UPDATED 14th NOVEMBER 2022 MONDAY 7:20 PM
Fuel Under GST: పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి. అయితే ఈ విషయంలో రాష్ట్రాలు అంగీకరించబోవని ఆయన చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలంటే రాష్ట్రాలు దీనికి అంగీకరించాలి. రాష్ట్రాలు ఒప్పుకొంటే దీనికి కేంద్రం సిద్ధంగా ఉంది. అలాగే, దీన్ని ఎలా అమలు చేయాలి అనేది మరో అంశం. ఈ అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి దగ్గర లేవనెత్తాలి. మద్యం, చమురు.. రెండూ రాష్ట్రాలకు ఆదాయ వనరులు. ఆదాయం వచ్చే మార్గాన్ని రాష్ట్రాలు ఎందుకు వదులుకుంటాయి? ద్రవ్యోల్బణం, ఇతర అంశాలపై ఆలోచిస్తుంది ఒక్క కేంద్రం మాత్రమే’’ అని హర్‌దీప్ సింగ్ వ్యాఖ్యానించారు. మరోవైపు దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదలపై కూడా ఆయన మాట్లాడారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో అనేక దేశాల్లో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. ఉత్తర అమెరికాలో ఏడాదిలో పెట్రో ధరలు 43 శాతం పెరిగాయి.







