UPDATED 30th JUNE 2020 TUESDAY 10:00 PM
గంగవరం(రెడ్ బీ న్యూస్): మండలంలో మంగళవారం ఉదయం కురిసిన భారీ వర్షాలకు పలు కొండవాగులు ఉధృతంగా ప్రవహించాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు విస్తృతంగా వర్షాలు కురిశాయి. దీంతో మండలంలోని జువ్వమ్మ కాలువ, పెద్ద కాలువ, దొంగ కాలువ, తదితర కొండ వాగులు ఉధృతంగా ప్రవహించడంతో గోకవరం అడ్డతీగల ప్రధాన రహదారులు రవాణా స్తంభించింది. జువ్వమ్మ కాలువ వద్ద బ్రిడ్జి నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ వంతెన వాగు ఉధృతికి కొట్టుకుపోయింది. ఈ రహదారిలో నిర్మిస్తున్న బ్రిడ్జిల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.







