ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేసిన అధికారులు

గంగవరం (రెడ్ బీ న్యూస్) 10  నవంబర్ 2021: రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆదేశాల మేరకు బుధవారం మండల స్థాయి అధికారులు గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేశారు. తాహశీల్దార్ శ్రీమన్నారాయణ గంగవరం ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో రికార్డులను, వంటశాల, మరుగుదొడ్ల పరిశుభ్రతను తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం తయారు చేసిన భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే వేములోవ ఆశ్రమ ఉన్నత పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి మల్లేశ్వరరావు తనిఖీ చేశారు. పాఠశాలలో రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆర్.వి.వి సత్యనారాయణ, వసతి గృహా సంక్షేమ అధికారులు ఎం. శ్రీనివాసరావు, సీతారత్నం తదితరులు ఉన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us