సౌత్ ఇంటర్ యూనివర్సిటీ ఉమెన్స్ కబడ్డీ జట్టుకు ఆదిత్య విద్యార్థులు ఎంపిక

UPDATED 23rd SEPTEMBER 2019 MONDAY 6:30 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల విద్యార్థులు ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈనెల 18,19తేదీలలో పశ్చిమ గోదావరి జిల్లా నారాయణపురంలో నిర్వహించిన ఇంటర్ యూనివర్సిటీ ఉమెన్స్ కబడ్డీ పోటీలలో తృతీయ స్థానంలో నిలిచారని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శరభోజి తెలిపారు. అలాగే టీమ్ సభ్యులైన ఎస్.ఎస్.ఎస్. ఎల్. ప్రసన్న, ఎన్.అమ్ములు చెన్నైలో అక్టోబర్ 3నుంచి 6తేదీలలో జరిగే సౌత్ ఇంటర్ యూనివర్సిటీ ఉమెన్స్ కబడ్డీ జట్టుకు ఎంపికయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి కబడ్డీ కోచ్ ఎన్. రవి, విజేతలను అభినందించారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us