అమరావతి (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021 : భారీవర్షాలు, వరదలతో పంటలు నష్టపోయిన రైతులకు.. ఆహార పంటలకు ఎకరాకు రూ.30వేలు, ఉద్యాన, వాణిజ్య పంటలకు రూ.50వేల చొప్పున పరిహారాన్ని వారి ఖాతాల్లో జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.రామచంద్రయ్య, కేవీవీ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. వైరస్, తామరపురుగుతో మిరప సర్వనాశనం అయిన నేపథ్యంలో ఎకరాకు రూ.50వేల వంతున పరిహారం ఇవ్వాలన్నారు. భారీవర్షాలతో 12.22 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వారు వివరించారు. దెబ్బతిన్న ప్రాజెక్టులు, చెరువుల విషయంలో అధికారుల సమన్వయలోపం, నిర్లక్ష్యంపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. 12 డిమాండ్ల పరిష్కారానికి డిసెంబరు 13న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు. ‘పంటల బీమా, పెట్టుబడి రాయితీని రైతుల ఖాతాల్లో జమ చేయాలి. ఇసుక మేట, భూమి కోతలకు, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలకు ఇచ్చే పరిహారాన్ని రెట్టింపు చేయాలి. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి’ అని కోరారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







