UPDATED 29th AUGUST 2017 TUESDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో మంగళవారం ఘనంగా నేషనల్ స్పోర్ట్స్ డే వేడుకలను నిర్వహించారు. క్యాంపస్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ విభాగానికి సంబంధించి ముందుగా బాలురకు 300 మీటర్ల పరుగుపందెం, బాలికలకు 100 మీటర్ల పరుగుపందెం నిర్వహించారు. స్పోర్ట్స్ డే వేడుకలు సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సంస్థ చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ మనదేశంలో స్పోర్ట్స్ డే వేడుకలను ప్రతీ సంవత్సరం ఆగష్టు 29 న జరుపుకుంటామని, ఒలెంపిక్స్ లో స్వర్ణ పథకాలు సాధించిన హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ పుట్టినరోజు కావడం వల్ల ఆయనకు భారతీయ, ప్రపంచ హాకీలో ధ్యాన్ చంద్ ఒక ప్రముఖ వ్యక్తిగా సేవలందించి నందుకు గుర్తుగా ఆయన గౌరవార్దం ఈ క్రీడాదినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారన్నారు. క్రీడలతో శారీరక ధారుడ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు జ్ఞాపికతో పాటు ప్రశంశాపత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ ఎన్.సుగుణారెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శరభోజీ, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.







