UPDATED 15th SEPTEMBER 2018 SATURDAY 6:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యాప్రాంగణంలో గల ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలు సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి టెక్ ఫెస్ట్ వేద-2018 శనివారం విజయవంతంగా ముగిసింది. విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల ప్రాజెక్టులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నేటి వాస్తవిక, వాతావరణ పరిస్థితులకు అవసరాలకు అనుగుణంగా నిర్మించే బిల్డింగుల నమూనాలు, డ్యాములు, రోడ్ రవాణా మార్గాలను విద్యార్థుల ఆలోచనా విధానాలతో విశ్లేషించి చెప్పే విధానంతో ఎంతో విజ్ఞానదాయకంగా జరిగింది. వివిధ కళాశాలల నుండి వచ్చిన విద్యార్థులు సందేహాలను నివృత్తి చేస్తూ వాటి ఉపయోగాలను వివరించే విధానం సందర్శకులకు ఎంతో సంతృప్తినిచ్చింది. లాంగ్వేజ్ క్లబ్, ప్రస్తుత ప్రపంచీకరణలో భాషా ప్రావీణ్యం ఆవశ్యకతను చక్కటి పరిష్కార వేదికగా నిలిచింది. వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విచ్చేసిన అనుభవజ్ఞులైన ప్రొఫెసర్స్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి విద్యార్థులు సమర్పించిన పేపర్, ప్రాజెక్ట్, పోస్టర్ ప్రజంటేషన్స్ లో ఉత్తమ ప్రెజంటేషన్స్ లో ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు ఎంపికజేయటం జరిగిందని ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. జిల్లావ్యాప్తంగా గల ఇంజినీరింగ్ కళాశాలలతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా గల సుమారు 42 కళాశాలల నుంచి మూడువేలమంది విద్యార్థినీ, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమాలలో ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్. వైస్ ప్రిన్సిపాల్స్, వివిధ విభాగాధిపతులు, వాలంటీర్లు, టిహబ్ టీం, కలర్స్ మీడియా, తదితరులు పాల్గొన్నారు.







