ప్రగతిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

UPDATED 8th MARCH 2018 THURSDAY 9:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మహిళలకు హృదయపూర్వక శుభాభినందనలు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ మాట్లాడుతూ దేశపురోగతిలో అనాదిగా మహిళలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారని, ప్రస్తుత కాలంలో మహిళలు అన్నిరంగాలలో విస్తరించి ప్రపంచ పురోగతిలో కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారన్న ఆర్యోక్తిని అనుసరిస్తూ తమ కళాశాల అనేక మహిళా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని, కళాశాల అన్ని విభాగాలలో సుమారు 40 శాతం మహిళలను నియమించడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మేనేజ్మంట్ ఎం.వి. హరనాథ బాబు, డైరెక్టర్ డాక్టర్.జి.రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సత్యనారాయణ, డీన్-అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, మహిళా సాధికారత, గ్రీవియన్స్ విభాగ మెంబర్ ఎం. మాధవి, వివిధ విభాగాల ఆధిపతులు, అధ్యాపకులు, అధిక సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us