ఆదిత్యలో ఘనంగా గురుపూర్ణిమ మహోత్సవాలు

UPDATED 27th JULY 2018 FRIDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య క్యాంపస్ లో గురుపూర్ణిమ పర్వదినం పురస్కరించుకొని సాయి బాబా ఆలయంలో గురుపూర్ణిమ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భాగంగా వేదపండితుల వేదమంత్రోచ్ఛరణలతో కాకడ హారతి, విశేష పూజలు, హోమములు, గణపత్యాది పంచాయతన దేవతలకు విశేష పూజలు, పంచామృత అభిషేకములు, విశేష పుష్పాభిషేకములు, సహస్ర నామార్చన, నీరాజన మంత్ర పుష్పం, మహదాశీర్వచనం, తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆదిత్య ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ పూజా  కార్యక్రమాలలో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, లక్ష్మీరాజ్యం దంపతులు, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి,  శృతి దంపతులు, కృష్ణదీపక్ రెడ్డి, డాక్టర్ సుగుణారెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమాలలో వివిధ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాల్స్,  విభాగాధిపతులు, విద్యార్థినీ, విద్యార్థులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us