UPDATED 6th DECEMBER 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: పదవతరగతి ఫలితాల్లో నూరు శాతం ఉత్తమ ఫలితాలతో పాటు 10/10 జిపిఎ సాధించే విధంగా కృషి చేయాలని మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, స్టేట్ అకాడమిక్ కోఆర్డినేటర్ బాబూరావు అన్నారు. స్థానిక యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులతో పదవతరగతి విద్యార్థుల ప్రగతిపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ పదవతరతిలో 10/10 జిపిఎ సాధించి తద్వారా మన పట్టణం, జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని, అలాగే ప్రణాళికాబద్ధంగా టైమ్ టేబుల్ వేసుకుని క్రమశిక్షణతో ప్రతీ రోజు పాఠశాలకు హాజరై గురువులు చెప్పిన విషయాలను ఆకళింపు చేసుకుని తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని అన్నారు. ఈ సమావేశంలో పాఠశాల హెచ్ఎం యు. సత్యన్నారాయణ, యుఎల్ బి కోఆర్డినేటర్ కెఎస్ఎస్ శేఖరం, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.







