UPDATED 23rd JUNE 2018 SATURDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలకు చెందిన 16 మంది విద్యార్థినీ, విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2017 ప్రతిభా అవార్డులు కైవసం చేసుకున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 32 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు 25 ప్రతిభా అవార్డులు ప్రకటించగా, ఒక్క ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులే ఇంజనీరింగ్ లో 13 అవార్డులను కైవసం చేసుకున్నారని, ఈ నెల 27వ తేదీన కాకినాడ జె.ఎన్.టి.యులో జరిగే కార్యక్రమంలో విద్యార్థులకు రూ. 20వేలు నగదు పురస్కారంతో పాటు ట్యాబ్, ప్రశంసాపత్రం అందచేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, డాక్టర్ కె. రవిశంకర్, ప్రొఫెసర్ వి. రమేష్, తదితరులు విద్యార్థులను అభినందించారు.







