UPDATED 27th DECEMBER 2018 THURSDAY 6:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య ఫార్మసీ కళాశాలలో ఎడ్యుకేషన్, రీసెర్చ్, అకడమిక్ అండ్ ఇండస్ట్రీ కోలాబొరేషన్, యాంటీ మలేరియా డ్రగ్ డవలప్ మెంట్ అనే అంశాలపై టొరంటో యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మి.పి. కొట్ర సైంటిఫిక్ టాక్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వై. సురేంద్రనాధరెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా డాక్టర్ కొట్ర మాట్లాడుతూ విద్యార్థులు నూతన పరిశోధనలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఫార్మసీ రంగంలో పరిశోధనలకు పెద్దపీట వేయడం జరుగుతుందని అన్నారు. వివిధ రంగాలలో పరిశోధనా విధానాలు ఎంతో మెరుగయ్యాయని, వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకొని అభివృద్ధి చెందాలని తెలిపారు. ఎప్పటికప్పుడు నూతన పరిశోధనలతో అవసరాలకు అనుగుణంగా ఔషధాల అభివృద్ధి జరగాలని, అలా వినూత్న ఆలోచనలతో పరిశోధనలు కావించిన వారికి మాత్రమే మనుగడ ఉంటుందని అన్నారు. విద్య, పరిశోధన, ఉద్యోగం ఈ మూడింటిని సమానంగా ముందుకు తీసుకువెళ్లాలని, తద్వారా ఫార్మసీ రంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.







