మండపేట: 15 ఆగస్టు 2020( రెడ్ బీ న్యూస్): ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ భాదితులకు వైద్యులు అందిస్తున్న సేవలు అపూర్వమని, వెలకట్టలేనివని మండపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి సరిపల్లి గౌతమి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ద్వారపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ( పీ. హెచ్.సీ) వైద్యాధికారిణి డాక్టర్ లక్ష్మీ ప్రసన్న ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి ఆమెను శనివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండపేట మండలంలో కరోనా వైరస్ పై పోరాటం చేయడానికి తనతోపాటు అత్యుత్తమ బృందం ఉన్నందుకు తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ, సచివాలయ, వలంటీర్ లు, ఆశా, అంగన్ వాడి, ఏ.ఎన్.ఎంలు ఇలా అందరూ సమిష్టిగా రాత్రనక, పగలనక కోవిడ్ పై పోరాటం చేస్తూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా నియంత్రణకు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. వారికి పేరుపేరునా తన అభినందనలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ద్వారంపూడి పీ.హెచ్.సీ వైద్యాధికారిణి డాక్టర్ ప్రసన్న విరామం లేకుండా ఎంతో ఓర్పు, సహనంతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలిచారని, ఆమె అందిస్తున్న సేవలను కొనియాడారు. పంచాయతీ విస్తరణాధికారి ఐదం రాజు, వ్యవసాయ శాఖ అధికారి బలుసు రవి, మండల విద్యాశాఖధికారి నాయుడు రామచంద్రరావు, ఉపాధిహామీ ఏపీవో విజయభారతి, హౌసింగ్ ఏఈ గణేశ్వరావు, మండల పరిషత్ పరిపాలనాధికారి ప్రసాద్ తదితరులు ఆమె అందిస్తున్న సేవలను ప్రశంసించారు. అనంతరం పంచాయితీ కార్యదర్శులు, అధికారులు ఆధ్వర్యంలో ద్వారపూడి వైద్యాధికారిణి లక్ష్మీ ప్రసన్నను పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. కొవిడ్ నియంత్రణలో ఆమె నిరంతరం అందిస్తున్న వైద్య సేవలను పలువురు కొనియాడారు. అనంతరం ఆమెకు మండల పరిషత్ తరుపునుంచి ఉత్తమ సేవా పురస్కారంతోపాటు ప్రశంసా పత్రాన్ని అందచేశారు. అలాగే కోవిడ్ నియంత్రణకు తమవంతు సహకారంగా ఆమెకు వెన్నంటే ఉంటున్న సుపర్ వైజర్ సత్యనారాయణ, ఆరోగ్యమిత్ర వి.కల్యాణి అందిస్తున్న సేవలను పలువురు కొనియాడారు. అనంతరం వారిని దుశ్శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







