UPDATED 17th AUGUST 2018 FRIDAY 6:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు ఇసిఇ విభాగం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా నేటి నుంచి వచ్చే నెల ఒకటవ తేదీ వరకు రెండు వారాలపాటు ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (ఐవోటి) సర్టిఫికేషన్ కోర్సు ప్రారంభించినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. నేడు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ఈ కోర్సు ఎంతో దోహదపడుతుందని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులకు కాలిఫోర్నియా యూనివర్సిటీ సర్టిఫికెట్స్ అందచేస్తుందని, నేటి సాంకేతిక అవసరాలకు విద్యార్థులు ఏవిధంగా సమాయత్తం కావాలనే విషయంపై సరైన దృక్పధం కలగడానికి ఈ ప్రోగ్రాం ఎంతో తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎ. రామకృష్ణారావు, విభాగాధిపతులు ఆర్.వి.వి. కిషోర్, డి. కిషోర్, అధ్యాపక సిబ్బంది వి. ప్రీతి, ఎం. ప్రశాంత్, ఎ.కె.వి. నాగయ్య, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







