లయన్స్ క్లబ్ లో అవార్డు గ్రహీతలకు సన్మానం

UPDATED 9th MARCH 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: విధి నిర్వహణలో అధికారులు, సిబ్బంది చేసిన సేవలే వారికి పురస్కారాలు తీసుకువస్తాయని అర్బన్, రూరల్ ఐసిడిఎస్ సిడిపివో టిడిఆర్ పద్మావతి తెలిపారు. ఐసిడిఎస్ సూపర్ వైజర్ నళిని అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర, జిల్లాస్థాయిలో అవార్డులు పొందిన మహిళలకు స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఉత్తమ అంగన్వాడీ టీచర్ గా ఎం.వి. శ్రీలక్ష్మి, ఉత్తమ కిశోర బాలికగా బొడ్డు సుప్రియ, ఉత్తమ సామాన్య మహిళగా కృపావతి, ఉత్తమ ఉద్యోగులుగా శ్రావణి, సత్యశార్వాణి, కనకదుర్గ, మంగతాయారు, సీతారత్నం, తేజస్వని, హేమలత, జ్యోతిలక్ష్మి మాధవి, హర్షిణి, మంగ, కె. నాగమణి తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాకినాడ డివిజన్ పరిధిలో ఉత్తమ సిడిపివో గా ఎంపికైన టిడిఆర్ పద్మావతి దంపతులను సన్మానించి జ్ఞాపిక అందచేశారు. అనంతరం నిర్వహించిన నృత్యప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us