UPDATED 21st JULY 2018 SATURDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ మహిళా కమీషన్ వారి ఉత్తర్వులు మేరకు విద్యార్థినీ, విద్యార్థులకు బహుళ ఐచ్చిక విధానంలో మహిళా హక్కులు, అవగాహన అనే అంశంపై పోటీ పరీక్షలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ ఈ పోటీలను నిర్వహించడం వల్ల విద్యార్థులకు మహిళా హక్కులు, విధుల పట్ల అవగాహన కలుగుతుందని అన్నారు. ఈ పోటీల్లో 160 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల మహిళా గ్రీవియన్స్ సెల్, పరీక్షల నిర్వహణా విభాగం నిర్వహించిన ఈ పోటీలకు కళాశాల యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల మహిళా గ్రీవియన్స్ సెల్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ఎం. సోమిరెడ్డి, జె. బాలమోహన్ రాజు, రాజశేఖరరెడ్డి, అధ్యాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







