జిల్లాస్థాయి లైట్ మ్యూజిక్ పోటీల్లో ఆదిత్య విద్యార్థి ప్రతిభ

UPDATED 6th JANUARY 2018 SATURDAY 8:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి కాకినాడ ఐడియల్ కళాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి లైట్ మ్యూజిక్ పోటీల్లో ప్రథమ బహుమతి గెలుపొందినట్లు ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన స్వామి వివేకానంద జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని యువమహోత్సవాలలో భాగంగా నిర్వహించిన జిల్లాస్థాయి లైట్ మ్యూజిక్ పోటీల్లో తమ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి ఎం.డి. ఖాదర్ బుఖారి ప్రథమస్థానంలో గెలుపొందినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, తదితరులు అభినందించారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us