UPDATED 11th DECEMBER 2018 TUESDAY 8:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు వెంచర్ డవలప్ మెంట్ సెంటర్ (విడిసి) ద్వారా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు వర్క్ షాప్ ఏర్పాటు చేసినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమానికి అమెరికాలోని బోస్టన్ లో గల నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ గ్రెగ్ కొలియా, అడ్వైజరీ బోర్డు మెంబర్ క్రిష్ నాంజిగెడ్డ పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు, సలహాలను అందించారు. ఆదిత్య అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన విడిసిని వారు సందర్శించారు. అనంతరం ఇంజనీరింగ్ సిలబస్ ను విడిసితో అనుసంధానం చేసే అంశంపై ప్రిన్సిపాల్స్, విభాగాధిపతులు, అధ్యాపక సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ విజయవాడలో ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్న గ్రాండ్ ఫినాలేలో విద్యార్థులు పాల్గొని తమ నూతన ఆలోచనలను ప్రదర్శించాలని, అందులో అర్హత పొందిన వినూత్న ఆలోచనలకు ప్రోత్సాహకాలను అందజేయడంతో పాటు పెట్టుబడుల ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







