ఆదిత్య ఎన్ఎస్ఎస్ విద్యార్థులచే పుస్తకాల పంపిణీ

UPDATED 29th JUNE 2018 FRIDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తమ ఆదర్శవంతంతమైన పనులతో ఇతరులకు మార్గదర్శకంగా నిలిచారని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్ అన్నారు. పిఠాపురం మండలం మంగుతుర్తి  గ్రామం మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిళ్లు, స్కూల్ బ్యాగులు, తదితర సామగ్రిని పాఠశాలలో నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమంలో శుక్రవారం అందచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సి.హెచ్. సువర్ణలత, కాంప్లెక్స్ హెచ్ఎం సుబ్రహ్మణ్యం, గ్రామ సర్పంచ్ కృపారావు, విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఎన్ఎస్ఎస్.ప్రోగ్రాం కన్వీనర్లు బాలమోహన్, ఎమ్. సోమిరెడ్డి, వాలంటీర్లు పాల్గొన్నారు. విద్యార్థుల సేవానిరతికి ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, తదితరులు అభినందించారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us