ఆదిత్య ప్రొఫెసర్ కు డాక్టరేట్

UPDATED 27th MARCH 2018 TUESDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న జి.ఎస్.ఎన్. మూర్తి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టా పొందినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ కళాశాలకు చెందిన ప్రొఫెసర్ మూర్తి సమర్పించిన థీసిస్ కు రాయలసీమ యూనివర్సిటీ, కర్నూల్ నుంచి డాక్టరేట్ పట్టా పొందినట్లు తెలిపారు. డాక్టర్ మూర్తి భవిష్యత్తులో మరింత ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వివిధ విభాగాధిపతులు ప్రొఫెసర్ మూర్తిని అభినందించారు.   
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us