UPDATED 14th AUGUST 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి విశేష స్పందన లభించినట్లు పెదబ్రహ్మదేవం ప్రభుత్వ ఆయుర్వేద కేంద్రం వైద్యురాలు డాక్టర్ ఎం. నీరజ పేర్కొన్నారు. ఆయుష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో126 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందచేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నీరజ మాట్లాడుతూ ఆయుష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు చల్లా బుజ్జి, ఎంపిడివో సిహెచ్ జగ్గారావు, ఏఎన్ఎం సూర్యకుమారి, అమ్మాణీ, కె. సుబ్బలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.







