UPDATED 12th FEBRUARY 2018 MONDAY 7:30 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణం స్థానిక సత్యనారాయణపురం మురుగు కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. పోలీసులు కథనం ప్రకారం మృతుడికి సుమారు 50 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటుందని, 5.5 ఎత్తు కలిగి ఉన్నడన్నారు. అలాగే బిస్కెట్ రంగు చొక్కా ధరించి ఉన్నాడని చెప్పారు. డ్రైన్ గట్టుపై విశ్రాంతి తీసుకుని ఉండగా ప్రమాదవశాత్తు కాల్వలో పడి మృతి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి ఎస్సై ఎల్. శ్రీనివాస్ నాయక్ దర్యాప్తు చేస్తున్నారు.







