వీరవిధేయతే ఆయన బలం..

* అపర చాణుక్యుడు.....నిమ్మకాయల చినరాజప్ప
* విశ్వాసమే  ఆయన ప్రాణం
* పదవులు ఆయనకు తృణప్రాయం
UPDATED 2nd SEPTEMBER 2017 SATURDAY 10:00 PM
అమరావతి : ఏకలవ్యుడు మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న పాత్ర. గురువు పట్ల ఎనలేని అచంచల భక్తి ప్రపత్తులు గల ఏకలవ్యుడు తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా తన కుడి చేతి బొటన వేలుని కోసి గురుదక్షిణగా సమర్పించి చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు. వీరవిధేయత, పార్టీలో సుదీర్ఘ అనుభవం, క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం. రాజకీయాల్లో అందరూ దొంగలు, విశ్వాసఘాతకులే ఉండరు. తాము పొందే లబ్ధికి తగ్గట్లుగా రుణం తీర్చుకునేవారు కూడా ఉంటారు. ఇప్పుడు ఏపీలో సీఎం చంద్రబాబుకు అలాంటి విశ్వాసపాత్రుడైనే నేత దొరికారు. పార్టీలో సుదీర్ఘ అనుభవం, క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం, సామాజికవర్గంలో తనకంటూ ఒక గుర్తింపు ద్రోణాచార్యుడు లాంటి చంద్రబాబు చెప్పిందే వేదం ఆయన ఆదేశాలే శిరోధార్యంగా భావించే టీడీపీ సుశిక్షితనేత, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప. తనపై పార్టీ అధినేత కున్ననమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయని విధంగా వ్యవహరిస్తూ చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడుగా మారారు. ఏనాడు పదవుల కోసం ఆయన వెంపర్లాడలేదు.పదవులే ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. దానికి కారణం గత ముప్పై సంవత్సరాలకు పైగా తెలుగుదేశం పార్టీలోసుశిక్షితుడైన కార్యకర్తగా ఉండడమే. ఎందరో నాయకులు తరచు పార్టీలు మారినాసరే తనకు రాజకీయ జీవితానికి మలుపుకు కారణమైన తెలుగుదేశం పార్టీని గాని, తానంటె ఎంతో నమ్మకం కలిగిన చంద్రబాబుకు నమ్మకద్రోహం చేయడం ఇష్టం లేని రాజప్ప టీడీపీని వదలడానికి ఇష్టపడలేదు. తనకు పదవులు తృణప్రాయమని, పార్టీ అధినేత గీసిన గీతే తనకు లక్ష్మణరేఖని సగర్వంగా చెబుతారు చినరాజప్ప. అందుకే ఆయనను ఉపముఖ్యమంత్రి పదవితో బాటు అత్యంత ప్రాముఖ్యత కలిగిన "హోం" శాఖలు వరించాయి. పదవులు తనను ఆయాచితంగా వరించినగాని ఏనాడు తన అధికార దర్పాన్ని ప్రదర్శించలేదు. అదే ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్.పార్టీ అధినేత చంద్రబాబు తనకు ఏ బాధ్యతను అప్పగించినా చాలా నైపుణ్యంతో, రాజకీయ చతురతతో విజయవంతంగా పూర్తి చేయడం ఆయన నైజం. ఎంతోమంది రాజకీయ దురంధురులున్న గుంటూరు జిల్లాకు ఇన్ చార్జి మంత్రిగా నియమించినప్పటికీ జిల్లాలోని టీడీపీ శ్రేణులను ఏకతాటి పైకి తీసుకొచ్చి చంద్రబాబు మన్ననలను పొందారు. ఆ నమ్మకం, విశ్వాసంతోనే కాకినాడ నగరపాలకసంస్ధ ఎన్నికల బాధ్యతను చినరాజప్పపై ఉంచారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే కాకినాడ నగరపాలక సంస్ధను గెలిపించి తమకు కానుకగా ఇస్తానని చంద్రబాబుకు మాట ఇచ్చారు. మాట ఇచ్చిందే తడవుగా కార్యక్షేత్రంలో అడుగు పెట్టి అన్ని తానై టీడీపీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసి గెలుపు కోసం ముందుకు సాగారు. రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడుతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఆయన సలహాలు, సూచనలతో ముందుకు సాగారు. ఒకవైపు ముద్రగడ పద్మనాభం ఆందోళనల నేపధ్యంలో కాపు సామాజిక వర్గం టీడీపీకి దూరమవుతోందనే దుష్ప్రచారానికి విజయవాడలో నిర్వహించిన కాపు సమావేశం ద్వారా ముగింపు పలికారు. స్వయంగా ముఖ్యమంత్రి పాల్లొన్న ఈ సమావేశానికి గోదావరి జిల్లాల నుండి వేలాది మంది కాపులు తరలిరావడంతో రాజకీయ వర్గాలు ఆశ్చర్యపోయాయి. ఈ సమావేశం విజయవంతం కావడం ద్వారా చినరాజప్పకు చంద్రబాబు నుంచి ఊహించని ప్రశంసలు లభించాయి. ఆ ప్రశంసలే చినరాజప్పకు ఒక "టానిక్"లా పనిచేశాయి. దీంతో ఆయన కాకినాడలోనే మకాం పెట్టి టీడీపీ శ్రేణులకు సూచనలు, సలహాలు ఇస్తూ గెలుపు కోసం బాటలు వేశారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో కూడా అంతగా కష్టపడని చినరాజప్ప కె.ఎం.సీ ఎన్నికలను ఒక ఛాలెంజ్ గా తీసుకుని పనిచేశారు. తన వ్యూహాలకు ఒకవైపు పదునుపెడుతూనే.. పార్టీ అధినేత సూచనలను మరోవైపు పాటిస్తూ కె.ఎం.సీ.లో తెలుగుదేశం జండా రెపరెపలాడించడంలో చినరాజప్ప సఫలీకృతులయ్యారు. పార్టీ అధినేతకు ఇచ్చిన మాటను నిలబెట్టిన చినరాజప్ప మరోసారి చంద్రబాబు నాయుడు నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఒంటిచెత్తో కాకినాడ నగరపాలకసంస్ధను టీడీపీ కైవసం చేసిన చినరాజప్పలాంటి కొందరుంటే చాలు ఎప్పటికీ ఎన్నటికీ రాష్ట్రంలోఅధికారం టీడీపీదేనని
చంద్రబాబు వ్యాఖ్యనించడం కొసమెరుపు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us