UPDATED 27th APRIL 2018 FRIDAY 9:00 PM
ఏలూరు: హేలాపురి డైమండ్ లైన్స్ క్లబ్ అధ్యక్షుడు పెద్దిరెడ్డి ప్రదీప్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఆధ్వర్యంలో రాజేశ్వరి రామకృష్ణన్ ఆసుపత్రి సౌజన్యంతో స్థానిక హనుమాన్ నగర్ లో ఉచిత నేత్ర వైద్య శిబిరం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ సర్వేంద్రియానాం నయనం ప్రధానమని, ఎంతోమంది పేదలు నేత్ర వైద్యం చేయించుకోవడానికి ఆర్ధికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ శిబిరాన్నిఏర్పాటు చేశామన్నారు. ఈ శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్ళజోళ్ళు అందచేశామని, అలాగే శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి రాజేశ్వరి రామకృష్ణన్ సౌజన్యంతో నిర్వహిస్తామన్నారు. హేలాపురి డైమండ్ లైన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటుందని, అందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, అన్నార్తుల ఆకలి తీర్చడం, రుబెల్లా వ్యాక్సిన్ పంపిణీ, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ వంటి ఎన్నో విద్యా, వైద్య, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ఫత్తేబాద్ లోని నిశ్చింత వృద్ధుల ఆశ్రమంలో ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేశారు. అలాగే గోపన్నపాలెంలోని సాయిధామ్ వృద్ధాశ్రమంలో ఉచిత భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో కడియాల విజయలక్ష్మి, వడ్లపూడి కృష్ణమోహన్, ఎల్.వి.ఆర్, సురేష్, గుమ్మడి చైతన్య, బొప్పన శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.







