రుద్రాస్ యాప్ రూపొందించిన ఆదిత్య ప్రొఫెసర్

UPDATED 5th APRIL 2018 THURSDAY 5:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఫార్మసీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్  కె. హరి కామేష్ కిరణ్ "రుద్రాస్" పేరిట ఒక ఫార్మకాలజీ యాప్ ను రూపొందించారని ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్  వై. సురేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిధిగా పాల్గొన్న సతీష్ రెడ్డి మాట్లాడుతూ"రుద్రాస్"యాప్ ద్వారా విద్యార్థులకు, అధ్యాపకులకు ఎంతో విలువైన సమాచారం సేకరించడానికి ఉపయోగంగా ఉంటుందని అన్నారు. ఈ అప్లికేషన్ రూపొందించిన హరి కామేష్ కిరణ్ ను అందరూ ఆదర్శంగా తీసుకొని నిరంతరం సరికొత్త ఆవిష్కరణలకు కృషి చేయాలని అధ్యాపకులకు సూచించారు. ప్రొఫెసర్ హరి కామేష్ యాప్ గురించి వివరిస్తూ ఈ అప్లికేషన్ ఫార్మసీ, మెడికల్, నర్సింగ్, డెంటల్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తయారుచేయడం జరిగిందని, దీనిని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు. ఈ అప్లికేషన్ లో ఫార్మకాలజి, ఫార్మకోకినెటిక్స్, ఫార్మకోడైనమిక్స్ కు సంబందించిన విషయాలు విద్యార్థులకు సులువుగా అర్ధమయ్యే విధంగా పొందుపర్చడం జరిగిందని, రోగాలు, అవయవాలకు సంబందించిన డ్రగ్ క్లాసిఫికేషన్స్, ఫార్మసీ విద్యార్థులకు జి-పాట్, డ్రగ్ ఇనస్పెక్టర్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే విధంగా మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్, ఔషధం వివరాల బ్రోచర్ ను కూడా పొందుపరచడం జరిగిందని అన్నారు. విద్యార్థులకు, అధ్యాపకులకు ఎంతో ఉపయోగకరమైన ఒక చక్కని యాప్ ను రూపొందించిన హరి కామేష్ ను  ప్రిన్సిపాల్  సురేంద్రనాథ్ రెడ్డి అభినందించారు. అనంతరం రుద్రాస్ యాప్ ను వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి. ప్రిన్సిపాల్ వై.సురేంద్రనాథ్ రెడ్డి విడుదలచేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us