UPDATED 6th DECEMBER 2017 WEDNEDAY 9:00 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామం శ్రీ శారదారామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదవ తేదీన మాతృశ్రీ శారదామాత 165వ జన్మతిథి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షులు తోటకూర గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు తోటకూర గంగాధర్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి పదిగంటల వరకు ఏకవార రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం రెండుగంటల నుంచి నాలుగుగంటల వరకు మాతృశ్రీ శారదామాత శోభాయాత్ర, అనంతరం ఆధ్యాత్మిక సభ, అర్హులైన లబ్ధిదారులకు దుప్పట్లు పంపిణీ జరుగుతుందన్నారు. అలాగే ప్రతీనెలా శ్రీ శారదామాత మహాన్నదాన పథకం లబ్ధిదారులకు బియ్యం పంపిణీ, సాయంత్రం ఆరుగంటలకు లలితా సహస్రనామాలతో అమ్మవారికి కుంకుమార్చన, మంత్రపుష్పం, ప్రసాదవితరణతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయన్నారు. ఈ సమావేశంలో సమితి గౌరవాధ్యక్షులు వింజమూరి సుబ్రహ్మణ్యశర్మ, కార్యదర్శి వి.విశ్వనాథం, నువ్వుల వెంకటరాజు, పెంటపాటి మల్లికార్జునరావు, నువ్వుల బాబ్జి, తెలుగుంట్ల నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.







