ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పనకు కృషి

UPDATED 7th JUNE 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చైర్మన్ అధ్యక్షతన గురువారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆసుపత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ పి. చంద్రరావు ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పన, సామాగ్రి కొనుగోలు, అదనపు వైద్యులు, సిబ్బంది నియామకం గురించి ఈ సమావేశంలో కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్ కుమారస్వామి మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.మూడు కోట్లు మంజూరయ్యాయని, దీనికి సంబంధించి త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఎంపిడివో కె. స్వప్న, కౌన్సిలర్ బడుగు శ్రీకాంత్, జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, ఏసుదాసు, పోలిపల్లి బాబీవర్ధన్, డాక్టర్ లక్ష్మి, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
 
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us