ఈ నెల 14, 15 తేదీల్లో ఆదిత్యలో క్యాంపస్ డ్రైవ్

UPDATED 12th SEPTEMBER 2017 TUESDAY 7:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో ఈ నెల 14, 15 తేదీల్లో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సంస్థ జెన్ క్యూ ఆధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు కళాశాల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఆదిత్యలో చదువుతున్న ఫైనల్ ఇయర్ ఈఈఈ, మెక్, ఈసీఈ, సీఈసీ, ఐటి, ఎంసీఏ (2018 బ్యాచ్)  బ్రాంచ్ విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగ చేసుకోవాలని ఆయన కోరారు. ఎటువంటి బ్యాక్ లాగ్ లేకుండా 70  శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు హైదరాబాద్ లో టెస్ట్ ఇంజనీర్ గా పనిచేయవలసి ఉంటుందని , ఎంపిక ప్రక్రియ వ్రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్స్, టెక్నికల్ రౌండ్ , సీనియర్ విపి అండ్ హెచ్ ఆర్ రౌండ్ , సీఈవో రౌండ్  విధానాల ద్వారా జరుగుతుందని, ఎంపికైన వారికి రూ. 2.52 లక్షలు వార్షిక వేతనంతో ఉద్యోగాలు పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, ప్లేస్మెంట్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.        

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us