UPDATED 20th DECEMBER 2019 FRIDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్):తూర్పుగోదావరి జిల్లా బాలుర, బాలికలకు గత ఐదు రోజులుగా స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కబడ్డీ శిక్షణ శుక్రవారం ముగిసింది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన క్రీడాకారులు విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలో గల మునగపాక గ్రామంలో ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు జరుగు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈ క్రీడాకారులకు అవసరమైన కిట్లు, టీషర్ట్స్ పట్టణానికి చెందిన గౌరీచంద్ తన తల్లిగారైన శకుంతల పేరు మీద క్రీడాకారులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.వి.డి ప్రసాద్, కార్యదర్శి కొండపల్లి శ్రీనివాసరావు, ప్రోకబడ్డీ న్యాయనిర్ణేత బి. మురళీకుమార్, నిమ్మకాయల కిరణ్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయుడు వైకుంఠం, కెనడీ, వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.







