ఏ సమస్య ఉన్నా నేరుగా సంప్రదించండి: ఎస్పీ

రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 12 నవంబర్ 2021 : అర్బన్‌ పోలీసు శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి ఎటువంటి సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించవచ్చునని అర్బన్‌ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి సూచించారు. తన కార్యాలయంలో పోలీసు వెల్ఫేర్‌ డే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ప్రతి వారం ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అధికారులు, సిబ్బంది ఎవరైనా స్వయంగా తనను కలిసి సమస్యలు తెలియజేయవచ్చునన్నారు. సిబ్బంది సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us