UPDATED 16th JUNE 2018 SATURDAY 9:30 PM
సామర్లకోట: సామర్లకోట మండలం మేడపాడు గ్రామానికి చెందిన మేడిశెట్టి కృష్ణవేణి, జంపు సంగీత కుటుంబ సభ్యులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప శనివారం పరామర్శించారు. ఇటీవల కాకినాడ బీచ్ లో కృష్ణవేణి, సంగీతలు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రమాద సంఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కృష్ణవేణి కుటుంబ సభ్యులకు రూ ఐదు లక్షలు చంద్రన్న భీమా పరిహారం అందచేశారు. అలాగే సంగీత మృతికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. మంత్రి వెంట సామర్లకోట ఎఎంసి చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, సర్పంచ్ సూర్యకుమారి, ఎంపిటిసి యు. భాస్కరరావు, సొసైటీ అధ్యక్షులు పాలకుర్తి రవిబాబు, పి.వీర్రాజు, తదితరులు ఉన్నారు.







