రాజమహేంద్రవరం,29 డిసెంబర్ 2020(రెడ్ బీ న్యూస్): జగన్ అధికారంలోకి వచ్చాకా రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప వ్యాఖ్యానించారు. ప్రొద్దుటూరులో టీడీపీ అధికార ప్రతినిధి సుబ్బయ్య హత్యను ఆయన ఖండించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలను హత్యలు చేసి, దాడులకు పాల్పడుతున్నప్పటికీ డీజీపీకి చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై దాడులను అడ్డుకోవాలని పలుమార్లు ముఖ్యమంత్రికి, డీజీపీకి లేఖలు రాసినప్పటికి దున్నపోతు మీద వాన పడట్టు వ్యవహరిస్తున్నారని దుయ్యబ్టటారు. ఇప్పటికైనా టీడీపీ కార్యకర్తలపై దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని చినరాజప్ప డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. రైతులకిచ్చిన హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. రైతు సమస్యను పరిష్కరించాలని సామర్లకోట తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. వరదలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చినరాజప్ప డిమాండ్ చేశారు
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







