వనం-మనం కార్యక్రమంలో గైట్ విద్యార్థులు

UPDATED 17th MARCH 2018 SATURDAY 9:00 PM

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(గైట్) అటానమస్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం మండలంలోని కొత్త తుంగపాడు గ్రామంలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం మూడవ రోజుకి చేరింది. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం వనం-మనం కార్యక్రమం  నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పంచాయతీ కార్యాలయం, పాఠశాల, రహదారుల ప్రక్కన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రామ టిడిపి అధ్యక్షుడు దొడ్డా వెంకన్న మాట్లాడుతూ ప్రభుత్వం వనమహోత్సవం పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యమంలా చేపట్టారని, తద్వారా రాష్ట్రంలో పచ్చదనం పెంచడం ప్రధాన ఉద్దేశ్యం అన్నారు. గైట్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎం.వి. సుబ్బారావు మాట్లాడుతూ కాలుష్య నివారణ మొక్కలను పెంచడం సరైన మార్గం అని, నాటిన ప్రతీ ఒక్క మొక్కను పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొని మొక్కలు నాటారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us