UPDATED 12th NOVEMBER 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: అంగన్వాడీ సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ స్థానిక సిపిడివో కార్యాలయం, స్టేషన్ సెంటర్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులకు అందిస్తున్నపోషకాహారాన్ని నేరుగా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలని, ఈవో డ్యూటీలను రద్దు చేయాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించే వివిధ కార్యక్రమాలకు నిధులు పెంచాలని, కేంద్రప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందికి పెంచిన వేతనాలను తక్షణం చెల్లించాలన్నారు. అనంతరం అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిడివో పద్మావతికి వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో కె. వరలక్ష్మి, ఎంవి శ్రీలక్ష్మి, అధిక సంఖ్యలో అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







