ఆదిత్యలో విజన్ టాక్స్ పై వర్క్ షాప్

UPDATED 23rd JANUARY 2020 THURSDAY 6:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో విజన్ టాక్స్ అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించినట్లు డీన్ (స్టూడెంట్స్ విభాగం) ప్రొఫెసర్ జె.డి. వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం వక్తలు మాట్లాడుతూ విద్యార్థులను భవిష్యత్తులో మంచి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి, వారిలో వ్యాపారాత్మకమైన నూతన ఆలోచనలను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థ స్టార్ట్ అప్ టాక్స్ పేరిట ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసి వారిలో వ్యాపారపరమైన స్కిల్స్ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ సదస్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎ.పి.ఎస్.ఎస్.డి.సి సంస్థ ప్రతినిధులు పృధ్వి మాట్లాడుతూ తమ సంస్థ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు, వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. విద్యార్థులు ఎలాంటి రుసుము లేకుండా ఈ శిక్షణ పొందవచ్చని తెలిపారు. అలాగే వివిధ రంగాలకు చెందిన స్టార్ట్ అప్ కంపెనీల సిఈఓలు స్టార్ట్ అప్ సంస్థల ఆవశ్యకత, కష్ట నష్టాలు, వారి స్వానుభవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో విజన్ టాక్స్ ప్రతినిధులు పృధ్వి, అంజిరెడ్డి, డీన్ (అడ్మినిస్ట్రేషన్) డాక్టర్ టి. నరేంద్రుడు, ఆదిత్య సిబ్బంది చరణ్, సంజీవ్, విద్యార్థులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us