వేదమాత గాయత్రి దేవి అవతారంలో విజయదుర్గాదేవి

UPDATED 23rd SEPTEMBER 2017 SATURDAY 9:00 PM

రాయవరం: తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గా పీఠంలో దసరా శరన్నవరాత్రి  ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు అమ్మవారు వేదమాత గాయత్రి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేదపండితులు చీమలకొండ శ్రీనివాస్, చక్రవర్తుల మాధవాచార్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి పంచద్రవ్యాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అలాగే విఘ్నేశ్వర పూజ, సుప్రభాతసేవ, నవగ్రహారాధన మొదలైన పూజాదికాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. అనంతరం గాడ్  ప్రసంగిస్తూ వేదమాత గాయత్రి దేవిని పూజించడం ద్వారా సకల సౌభాగ్యాలు, శుభాలు కలుగుతాయని భక్తులకు వివరించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ వెంకటేశ్వరస్వామిని పూజించడం వల్ల కలిగే శుభాలు, వెంకటేశ్వర మహత్యం మొదలైన విషయాలపై భక్తులకు వివరించారు. అలాగే నవగ్రహ, నక్షత్ర, దుర్గా హొమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుతుకులూరు సర్పంచ్ సూర్య బ్రహ్మానంద రెడ్డి, వేదపండితులు చీమలకొండ వీరావధానులు, కోట లక్ష్మీనారాయణ, తోలేటి నాగేంద్ర శర్మ, రాజశేఖర్ శర్మ, కందర్ప హనుమాన్ తదితరులు పాల్గొన్నారు.         

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us