మార్చి 2 నుంచి ఆదిత్యలో ఇంటర్ కాలేజెస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్

UPDATED 1st MARCH 2018 THURSDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో ఈ నెల 2, 3, 4 తేదీలలో మూడు రోజుల పాటు జె.ఎన్.టి.యు.కె మహిళల గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ జరగనున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి అద్యక్షతన జరిగే ఈ పోటీల ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా జె.ఎన్.టి.యు.కె వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.ఎస్.ఎస్. కుమార్, గౌరవ అతిథులుగా జె.ఎన్.టి.యు.కె డైరెక్టర్ డాక్టర్ వి.వి.సుబ్బారావు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ అబ్బయ్య, మహిళా సాధికార సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ స్వర్ణకుమారి హాజరుకానున్నారని తెలిపారు. బాస్కెట్ బాల్, బాడ్మింటన్, షటిల్, ఖో-ఖో, కబడీ, టేబుల్ టెన్నిస్, త్రో-బాల్, వాలీ బాల్, చెస్, తదితర అంశాలలో జరగనున్న ఈ పోటీలకు రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల నుంచి 56 కళాశాలలకు చెందిన 2500 క్రీడాకారులు  పాల్గొంటారన్నారు. అలాగే ఈ నెల 2, 3 తేదీలలో రెండు రోజులపాటు జరగనున్న జె.ఎన్.టి.యు.కె ఇంటర్ కాలేజెస్ అథ్లెటిక్ (మెన్&విమెన్) మీట్ కు రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు చెందిన క్రీడాకారులు రన్నింగ్, త్రోస్, జంపింగ్, అంశాలలో పాల్గొంటారని సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె.రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, మీట్ ఆర్గనైజషన్ సెక్రటరీ సి.హెచ్. మురళీ మోహన్, వ్యాయమ అధ్యాపక బృందం, తదితరులు పాల్గొన్నారు.      
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us