UPDATED 3rd DECEMBER 2019 TUESDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): ట్రాన్స్ ఫర్మేషన్ ఆఫ్ మున్సిపల్ స్కూల్స్ ప్రాజెక్టుతో ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతమవుతాయని మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు అన్నారు. సామర్లకోట పట్టణంలోని మున్సిపల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ట్రాన్స్ ఫర్మేషన్ ఆఫ్ మున్సిపల్ స్కూల్స్ ప్రాజెక్టు అంశంపై స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో మంగళవారం వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ ఏసుబాబు మాట్లాడుతూ ట్రాన్స్ ఫర్మేషన్ ఆఫ్ మున్సిపల్ స్కూల్స్ ప్రాజెక్టుపై ఉపాధ్యాయులు అవగాహన పెంపొందించుకుని విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జితేంద్ర, ప్రాజెక్ట్ సూపర్ వైజర్ కెఎస్ శేఖరం, బి. రాజులు, తదితరులు పాల్గొన్నారు.







