UPDATED 1st DECEMBER 2018 SATURDAY 7:00 PM
సామర్లకోట: విద్యార్థి దశ నుంచి జీవన నైపుణ్యాలను అలవర్చుకోవడం ద్వారా ఆరోగ్యకర సమాజానికి నాంది పలకాలని బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయి రామకృష్ణ పేర్కొన్నారు. పాఠశాల జూనియర్ రెడ్ క్రాస్, సైన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు ఏ.ఎల్.వి. కుమారి, సిహెచ్ భద్రావతి విద్యార్థులు తీసుకోవలసిన పలు జీవన నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతీ ఒక్కరూ కనీస అవగాహన పెంపొందించుకోవాలని, ప్రపంచంలో హెచ్ఐవి వ్యాధి వ్యాప్తిలో మనదేశం రెండో స్థానంలో ఉండడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఎయిడ్స్ వ్యాధి నివారణ, నియంత్రణపై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని, ఎయిడ్స్ రోగుల పట్ల ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు షఫియుల్లా, జి. గోవిందు, కె.వి.వి. సత్యనారాయణ, ఎపి రాజేంద్రకుమార్, చంద్రమోహన్, నాగలక్ష్మీ, కె. అరుణ, పిడి తాళ్లూరి వైకుంఠం, తదితరులు పాల్గొన్నారు.







