ప్రగతిలో కమ్యూనల్ హార్మొనీ వీక్ నిర్వహణ

UPDATED 25th NOVEMBER 2019 MONDAY 5:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెంలోని ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి 25 తేదీ వరకు కమ్యూనల్ హార్మొనీ వీక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ డాక్టర్ వై.డి. రామారావు, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు అధికారులు డాక్టర్ జి. దుర్గరాజు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోస్టర్ ప్రెజంటేషన్లు, క్లాసికల్ డాన్స్, ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం పోటీలు నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (కాకినాడ), హెడ్.సి.ఎఫ్.సి బ్యాంకు వారి సంయుక్త సౌజన్యంతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో సుమారు 100 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ మన శరీరంలో రక్తం పునరుత్పత్తి అయ్యే అవకాశం ఉన్నందున ప్రతీ ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని, అలాగే ప్రతీ ఒక్కరూ రక్తం ఇచ్చి పది మందిని కాపాడాలని పిలుపునిచ్చారు. సమాజ సేవలో విద్యార్థులు ఎల్లప్పుడూ ముందుండాలని ఆయన సూచించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ డాక్టర్ రామారావు మాట్లాడుతూ ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల విద్యారుల సేవాభావాన్ని కొనియాడుతూ, ఎలాంటి సేవా కార్యక్రమాలకైనా తమ సంస్థ తోడుగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు, రక్తదానం చేసిన విద్యార్థులకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాధబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.శంభుప్రసాద్, వివిధ విభాగాల అధిపతులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్, అధ్యాపకులు, స్టూడెంట్ కోఆర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us