రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైన కెఎన్ఎస్ విద్యార్థిని

UPDATED 22nd SEPTEMBER 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు పట్టణానికి చెందిన బొడ్డు సుప్రియ ఎంపికైనట్లు కెఎన్ఎస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్ లో శనివారం జరిగిన అండర్-19 జిల్లాస్థాయి తైక్వాండో పోటీల్లో తమ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సుప్రియ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైందని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. రాధాకృష్ణ, ఏవో జె.వి. నాయుడు, కోచ్ టి. శంకరరావు శాఫ్ కోచ్ సత్యవతి, జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రతినిధులు అర్జునరావు, తదితరులు ఆమెను అభినందించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us