UPDATED 14th SEPTEMBER 2017 THURSDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి టెక్ ఫెస్ట్ పోలీ వేద 2 కె 17 కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంస్థ వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు హాజరవుతారన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు ఈ పోలీ వేద 2 కె 17 చక్కని వేదికని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని కళాశాలలకు ఆహ్వాన పత్రాలు పంపినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ఎస్.టి.వి.ఎస్. కుమార్, ఎ. మాధవరావు, పలు విభాగాలకు చెందిన హెచ్వోడీలు పాల్గొన్నారు.







