ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 19 డిసెంబరు 2021: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రం భక్తజనంతో పోటెత్తింది. వేకువజామునే స్వామివారి తీర్ధపు బిందెతో గోదావరి జలాలను తీసుకువచ్చి అభిషేకించారు. పుష్పాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై దివ్యప్రబంధం పారాయణం నిర్వహించారు. ఉభయ రాష్ట్రాలనుంచి వేలాదిమంది భక్తులు గోవిందనామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మాఢవీధులలో స్వామివారికి ఏడు ప్రదక్షిణలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుని స్వామివారికి తలనీలాలు, కానుకలు సమర్పించారు. వివిధ సేవల ద్వారా స్వామివారి ఒక్కరోజు ఆదాయం రూ.7,59,018 లభించినట్టు ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







